కాగితప్పూలు

Important Note: Unauthorized usage in any mode is strictly  prohibited.

***
ఆణువణువూ  వేణువై, సప్త స్వరాల దేహమై, జీవితమే ఒక రాగమై సింధువైన నీలో కలిసిన బిందువని చెప్పుకోవలనుంది క్రీస్తు.

***
వానాకాలం పండక్కి కృష్ణమ్మ కొత్త చీర కట్టింది, హంసలదీవి అత్తారింటికి అతి వయ్యారంగా ముందుకు సాగుతుంది.

***
ఎర్ర సూరిడిని బుంగ ముతిగా పెట్టి అలకేసిన ఆకాశం నేల తల్లి నెర్ర విడిచి చినబోతే గక్కున కురిసే మేగమై అక్కున చేరింది . 

***
ఆకాశం చెట్టుకు ఎర్రని పండు కాసింది, పేరడిగితే సూరీడని చెప్పింది.

***
Stars are far away but I can see them like your twinkle smile in my memory.

***
కన్నె గోదారి పొంగులన్నీ రైతు కళ్ళని పెద్దవి చేసి కోర్కెలు నాట కళ్లాన్ని సిద్దం చేసుకోమంది. దవేలేస్వరం పెళ్లి విందులో పాల్గొన్న పెద్దల సంఖ్యకు లేక్కేముంది. 
***

యాడబోతివే  ఓ చెల్లలా ఆకాశాన దాపున మేఘమెక్కి డిల్లీ వెళితివా ? అన్న గుండె బరువు చేసి అల్లంత దూరన బుడ్డు గాడితో ఒంటరి గువ్వవై విలపించ వెళితివా ? భర్త భారాన్ని బంధమనే కొంగుకు ముడివేసుకుని నీ భాద్యత నెరవేర్చ వెలితివ.. తీరదమ్మా నే ఋణం కన్నీరు పాదాల కార్చినా... 

***

నేను గతానికి ఎదురుచూపును, భవిష్యత్తుకు చరిత్రను, ప్రస్తుతానికి ప్రభంజనాన్ని .

***
 ఆకాశాన అగ్గిపిడుగు ఆవిరయింది, సింహం లేని అడివి మూగపోయింది.. జోహార్ Legend 
***
నేను దుమ్ములో దూలిలొ కలిసి నా జ్ఞాపకాలు కూడా ఆవిరిలో కలిసిపోతే దేవా నా  అస్తిత్వం నీలో మిగిలిపోతే చాలు
***
 నీవే  మార్చిన కాలంతో, కాలాన్ని బట్టి మారలంటావు. అబివృద్ధి ముసుగులో తప్పని అనిపించకుండా కోర్కెలు తీర్చుకునే కొత్తమార్గాని అన్వేషిస్తూ ఉంటావు  అదీ  మంచేనని మొసపోతుంటావు, పరిగెత్తి పరిగెత్తి నిన్ను నీవే మర్చిపోతుంటావు ఓ మనిషి అది నీ పేరే నని గుర్తుందా ? ప్రకృతికి ఎదురొడ్డి జ్ఞానాన్ని పణంగా పెట్టి నాశనానికి నీ మరణాన్ని  వెలగా చెల్లించావు నీవు కట్టిన కాంక్రీట్ ప్రపంచంలో కూసన్త  నేల  వెతుకుతున్నా నిన్ను పూడ్చాటానికి  !

***

జ్ఞాపకాల దోసిట్లో ముళ్ళు , ముత్యాలు రెండూ ఉంటాయి ముళ్ళు గుచ్చుకున్నా అరచేతిలోని ముత్యాల రంగు మారకుండా కాపాడుకోవటమే జీవితమ్..

                                                                               ***

Law fails if there is no proof, science fails if there is no reason. Few clever are criminals in this world and for some good idea we can not guess the end result. Belief in God and living in morality is the only solution to the mankind...


*******


శూన్యంలో నిశబ్దం ఖాయమా..? అయితే నీవు లేవని తెలిసీ ఈ అంతుచిక్కని అలజడి ఏమిటి..??  నేస్తం నీ జ్ఞాపకాల చదరంగంలొ నేనుపుడు ఓడిపోతూనే ఉన్న ...!!

**********
చక్కని చుక్కలతొ చేరి ఆ వంకతోనే చూస్తాడు నెలవంక నేలవంక ..!!!

                                                                                                  **********

గొంతు సవరిస్తే కాదు హృదయం స్పందిస్తే సంగీతం, ప్రకృతి నీతో కలిసి పాట పాడితే సంగీతం, కల నిజమైతే సంగీతం, కన్నీరు ముంచుకొస్తే సంగీతం, చిరునవ్వు చిగురిస్తే సంగీతం, పసి పాప బోసి నవ్వు సంగీతం, కన్నె పిల్ల కొంటె నవ్వు  సంగీతం, కట్టుకున్న దాని పైట గాలి సంగీతం, లేగ దూడ గోధూళి సంగీతం, ఆకు రాలేది సంగీతం, పూవు పూసేది సంగీతం, పుట్టుక సంగీతం, చావు సంగీతం, దేవుని హృదయ తలంపు తాళమైతే నా జీవితమే సంగీతం, సృష్టిలోని ప్రతి సవ్వడి ఓ సంగీతం,

                                                                                                       **********
కలలే కథలుగా రాసుకున్న ప్రతి రాత్రి ఓ పుస్తకం  జీవితమే గ్రంధాలయం 
**********
రాత్రి అడవిని కాల్చే  అగ్ని కణికలే   ఈ స్వప్న కణికలు.
**********
ఆకాశానికి దుప్పటి కప్పిన కారు మబ్బులు వర్షంగా కురిశాక సూర్యుడు సంతోషమై ప్రకాశిస్తున్నాడు..!
పూవుల నుదిటి బొట్టు మరలా దిద్దుకుంటూ ప్రకృతి  కన్నె తన పచ్చని పైట పైకి సరిచేసుకుంది ...!!
**********
అవసరాల ఆకలితో కడుపు మండుతోన్నా
నా కన్నతల్లి భారత మాతకు
స్వదేశీ నూనె పెట్టి, కార్పొరేట్ షాంపూతో తల అంటి
అభివృద్ధి పట్టుచీర చుట్టి
మాటల నుదిటి బొట్టు పెట్టారన్నా...!

**********
దేవుడి పిచ్చోడు చచ్చిపోయాడు
ప్రతి రాతిలో శిల్పాన్ని వెతికే కన్నులున్న నీవు
నీ ప్రతి మాటను ఉలిగా మార్చావు,
చెక్కటం ప్రారంభించి మనిషికి నొప్పినే మిగిల్చావు
కాలం కలిసి రాక వల్లకాడు పిలిస్తే ఒంటరిగానే వెళ్ళిపోయావు!
నీ చిరిగిన జోలెను జాలితో మళ్లీ మళ్లీ కుడితే,
మంచి గులక రాళ్ళను నింపి 
గురి చూసి గుండెకే విసిరావు
అదేమంటే దేవుని వాక్యం ఇంతే  అన్నావు   
కాళీ జోలెను మిగిల్చి కన్నీళ్ళు విదిల్చి వెళ్ళావు !
దేవుడు ఇలాగే దేవుడిలాగేనా అని  ప్రతిబింబాన్ని
పోల్చుకోవాలుకున్నప్పుడు నిరాశతో మా రూపాన్నే
చూపించావు నిసి రాత్రి నిప్పుల కొలిమిలో కాలి
పైకి లేచే ధూప మాయా దర్పణంలో మనుజుణ్ణి
దైవజనుడుగా చూపావు !
ముహూర్తం తెలియని పెళ్లి కోసం ఎదురుచూస్తూ
దేవుడే నా వరుడు అన్నావు !
మరణంతో కొత్త కాపురం మొదలని చెబుతూ
మేమంతా ప్రేక్షకులమేనని తెల్చేసావు
అక్కడ జరిగే ముచ్చట గదిలోనే పరలోక గవిని లోనే కదా మరి!!
నిన్ను ఒప్పింప మెప్పింప మనసు గెలువ
మార్చ ప్రయత్నించి లోకం నీ ముందు
ఓడిపోయి దేవుడి పిచ్చోడిగా ముద్ర వేసింది
చచ్చిపోయావని  తెలిసి శ్వాస పీల్చుకొంది

********